29, నవంబర్ 2010, సోమవారం

ఎలుక జ్యోష్యాలు వచ్చేసాయా ?


(సాక్షి పత్రిక సౌజన్యం ..)
ఇంత వరకు చిలుక జ్యోష్యాలే అనుకున్నాం .ఇక ఎలక జ్యోష్యాలు మొదలయ్యి .ఆక్తోపాస్ "పాల్ "మాదిరిగా మన ఎలకలకు మంచి శిక్షణ ఇస్తే మంచిది

ఆమెరికా వెళ్ళినందుకు వారు ప్రాయశిత్తం చేసుకున్నారు


ఆమెరికా వెళ్ళినందుకు వారు ప్రాయశిత్తం చేసుకున్నారు .ఇంతకి వారు ఎవరు ?పౌరాహిత్యం చేసే బ్రాహ్మణులూ .అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నెల రోజుల పాటు ఆమెరికా లో బ్రహ్మాండంగా జరిగిన సంగతి తెలిసిందే .ఈ వ్రాతలు చేయించిన పురోహితులు ఆదివారం ప్రత్యేక పూజలు ద్వారా ప్రాయశిత్తం చేసుకున్నారు .సముద్రం మీదుగా ప్ర యానం చేస్తే బ్రాహ్మణత్వం పోతుందని ఆమెరికా వెళ్లి వ్రతాలు చేయించాడాంకి ముందుగా పలువురు నిరాకరించారు .అయితే వేద పండితులు భాగా ఆలోచించి ....ప్రతేయక పూజలు ద్వారా ప్రాయశిత్తం చేసుకోవచ్చని సూచించారు .ఆ మేరకు ప్రాయశిత్తం జరిగింది .వీరు యధావిధిగా తమ విధులలో హాజరవుతున్నారు

"చిరంజీవి " రాజకీయ ఆట అడుకోవడాంకి ఇదే మాంచి ఛాన్స్ ?


ప్రస్తుత రాజకీయంలో చిరంజీవి హాట్ హాట్ గా మారనున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది .కిరణ్ కుమార్ రెడ్డి కొత్త సి ఎం అయి ప్రభుత్వం లో ప్రక్షాళన చేపట్టిన నేపధ్యం లో చిరు నేడు కీలకంగ్గా మారారు .జగన్ వర్గాన్ని చెక్ పెట్టె విదంగా నిర్ణయాలు జరుగుతున్నాయి .జగన్ వర్గీయులుగా ముద్ర పడ్డ ఎం ఎల్ ఏ లను పక్కన బెట్టిన తరవాత జగన్ తిరుగుబాటు జెండా ఎగురవేస్తే ......తలెత్తే పరిస్తితిని ముందే ఊహించి కాంగ్రెస్ అధిష్టానం చిరును ముందే మచ్చిక చేసుకుని లైన్ లో పెట్టింది .పద్దెనిమిది మంది ఎం ఎల్ ఏ ల ప్రజా రాజ్యం మద్దత్తు కిరణ్కు అవసరమవుతుంది .కాగ ప్రజారాజ్యం మంత్రి వర్గంలో చేరుతుందా లేదా అన్నది అనుమానమే .చేరితే ఎదురయ్యే పరిణామాలను ఆ పార్టి అంచనా వేసు కుంటున్నది .మంత్రి వర్గంలో చేరితే ప్రభుత్వ పనులు అన్నిటింకి వంత పాడాలి .విమర్శలు చేయరాదు .అలాగైతే పార్టీ భవిష్యత్ ఏమిటి ? బయట ఉంది మద్దతు ఇస్తే ? ఎంత వరకు ప్రభుత్వాని ఆడించ వచ్చు అనేవి చిరు ముందున్న ప్రశ్నలు .?ఏది ఏమైనా చిరు రాజాకీయంగా ఆటడుకోవడంకి మంచి ఛాన్స్ వచ్చింది

28, నవంబర్ 2010, ఆదివారం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రాజీనామాలు ముఖ్యమంత్రి కోరడం వెనుక ?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గా ఉన్న వారి రాజీనామాలు తీసుకోమని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రెటరీ ని ఆదేశించడం కొత్త సి ఎం సరికొత పాలనకు శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోంది .క్లిష్ట కాలంలో ముఖ్యమంత్రి ముళ్ళ కిరీటాని ధరించిన కిరణ్ కుమార్ రెడ్డి తనదయన పాలన చేసేందుకు ముందుకు వెలుతున్నంట్లు కనిపించడం మంచి పరిణామమే .ఇంత వరకు జరిగిన పాలనకు సంభందించి అటు ప్రజలకు ,ఇటు పార్టికి నష్టం కల్గించే కొన్ని నిర్ణయాలు జరిగిన నేపధ్యంలో కొత్త సి ఎం ప్రజా రంజక పాలన చేసి పార్టిని గట్టు ఎక్కించే ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది .ఒకే సారి ప్రభుత్వ సలహాదారుల రాజిఇనామాలు కోరడం ద్వారా ప్రభుత్వం పార దర్శకంగ్గా ఉంటుందని జనాకి సంకేతాలు ఇచ్చి నట్లయింది (కాగ కే వి పి రామచంద్ర రావు తో సహా పలువురు ఇప్పటికే రాజీనామా చేసారు )

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ ?


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మాజీ విద్య శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ ఖారారు అయినట్లు వార్తలు వస్తున్న్నై .ఇదే నిజమైతే తెలంగాణకు ఉపముఖ్యమంత్రి దక్కినట్టే .అందున దళిత నేతను ఎంపిక చేసినట్లు లెక్క .తెలంగాణా రాష్ట్ర సమితి నేత కే సి ఆర్ తెలంగాణా ఎర్పిడేతే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని పదే పదే చెప్పడం ..అలాగే దళితుల్లో ఒక వర్గాంకి చెందిన వ్యక్తిని ఎంపిక చెయ్యడం ద్వార కాంగ్రెస్ ఆచి తూచి అడుగువేస్తున్నట్టు కనిపిస్తోంది

రామ్ చరణ్ "పెట్ " కాజల్ ?



రామ్ చరణ్ కు పెంపుడు జంతువు మనం మగధీర సినిమాలో చూసాం ..అదేనండి గుర్రం .దాని పేరు కాజల్

ఆడవారి తలపోటు అలా తగ్గుతుందా ?

ఆడవాళ్లకు ఈ మధ్య తలపోటు ఎక్కవతోంది .ఇంట బయట అలసి పోయే వార్కి సహజం గానే తలతిరుగుల్లు అధికమవుతున్నై .భర్త ,పిల్లల ఆలనా పాలన చూసి కాస్త రెస్ట్ తీసుకొంధామన్న కుదరని వార్కి ఇది మరి ఎక్కువ .ఇక అయిన దానికి ,కాని దానికి విపరీతంగా ఆలోచించడం మరో కారణం .అయితే ఈ కారణాల కంటే వారి తలనొప్పికి మరో కారణం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు .ప్రేమ గా భర్త చెంత స్వేదతీరే వారికి తలపోట్లు దూరంగా ఉంటాయట .భర్తతో నిత్యం అన్యోన్యంగా ఉండే వార్కి ఈ భాధ ఉండదని ..ఒకవేళ తలపోటు బాధిస్తే భర్త తో మురిపాలే దివ్యంగా పనిచేస్తయటా