31, డిసెంబర్ 2011, శనివారం

అయ్యో శనివారం " .కక్క ముక్క లేనిదే ముద్ద ...నూతన సంవత్సర..

అయ్యో శనివారం " అయితే నేమి ? కాస్త ఓపిక పడదాం.....ఏమిటీ శనివారం అనుకుంటున్నారా ? నూతన సంవత్సర రాక తో ఈ రోజు రాత్రి కి అందరికి పసందైన విందే ....కక్క ముక్క లేనిదే ముద్ద  దిగనివాళ్ళు చాల మందే ఉన్నారు .సాధారణ రోజుల్లో దొరకని ఎన్నో మాంసాహార రుచులు ఈ రోజు ప్రత్యేకం ...అందుకే కుర్రకారు మజా ....అయెతే ఈ రోజు శనివారం రావడం పలువురికి ఇబ్బంది అయ్యింది .శనివారం మాంసాహారం ముట్టని మాంసాహార ప్రియులకు శనివారం షాక్ ఇచ్చింది ....దీంతో ఎలా అనుకుంటూ బుర్ర గోక్కున్నారు ..దీనిలో సీనియర్స్ ఓ మాంచి ఐడియా ఇచ్చిసి వారిలో ఆనందాన్ని నింపారు .."".రాత్రి పన్నెండు గంటల వరకే శనివారం ...తర్వాత ఆదివారం ..అప్పటి వరకు ఎలాగు మేల్కుని ఉంటారు కదా ..అప్పుడు కానిచ్చెయ్యండి "....భలే ఉంది కాదు ఐడియా 




 తెలుగు బ్లాగర్లు అందికి నవ్య వత్సర శుభాకాంక్షలు 

10, డిసెంబర్ 2011, శనివారం

జగన్! ఎన్నికలకు సిద్దపడాలి

తన తండ్రి పేరుతో  వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టి పెట్టిన జగన్ తన సత్తా చూపవలసిన రోజు ముందుకు వచ్చేసింది ,కాంగ్రెస్స్ పార్టి విప్ దిక్కరించిన ఏం ఎల్ ఏ ల పై వేటు వేయడానికి డిల్లి పెద్దలు నిర్ణయించడం తో త్వరలోనే ఉప ఎన్నికలు రానున్నాయి .ప్రస్తుతం జగన్ కు మద్దతు ఇస్తున్న వారు అనర్హత కు గురి అవుతారు .ఈ నేపధ్యమ లో జగన్ వారిని తిరిగి ఎలా గెలిపిస్తారన్నాదే  వేచి చూడాలి అధికారం లో ఉన్న కాంగ్రెస్ ,ప్రతి పక్షమ్  లో ఉన్న తెలుగు దేశం రెండు కూడా జగన్ పైనే గురి పెడతాయ్ .వాటిని జగన్ ఏ విదంగా తట్టుకోగాలరో 

20, నవంబర్ 2011, ఆదివారం

రామ్ చరణ్ తేజ "మగధీర " మహేశ్ బాబు "దూకుడు " .ల మధ్య అక్షర యుద్ధం

ఎవరు మొదలు పెట్టారో కాని మళ్ళి అభిమానుల మధ్య ఘర్షణలు తల్లెట్టుతున్నై .తమ హీరో చిత్రం మాత్రమె రికార్డ్ సృష్టించింది అని......ఇదే నిజమైన రికార్డ్ అని  అక్షర యుద్ధం మొదలు పెట్టారు ,మొన్న నిన్న కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రాన్స్ ప్రకటలను బట్టి రామ్ చరణ్ తేజ "మగధీర " ,మహేశ్ బాబు "దూకుడు " సినిమాల వసూళ్లు ,రికార్డ్స్ గురించి వాదనలు జరుగుతున్నాయి .మాది నిజమైన రికార్డ్ అంటూ వాళ్ళు వీళ్ళు కూడా ప్రకనలు ఇచ్చుకున్నారు ..కొసమెరుపు ఏమిటంటే హీరోల మధ్య విభేదాలు పెట్ట వద్దు అంటూ కోరుకోవడం .....నిజమే ....హీరోల ఎప్పుడు స్నేహంగానే ఉంటారు ...పాపం ప్రాన్స్ ల మధ్య గొడవలు వస్తుంటై 

9, అక్టోబర్ 2011, ఆదివారం

"దూకుడు " వంద రోజుల వేడుక కాకినాడలో


మహేష్ బాబు లేటెస్ట్ హిట్ మూవీ "దూకుడు " వంద రోజుల వేడుక కాకినాడలో జరగనుంది ..దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా విషయం వెల్లడించారు .దూకుడు విజయ యాత్రలో భాగం గా చిత్ర బృందం కాకినాడ వచ్చారు .ఇక్కడే పుట్టి పెరిగిన శ్రీను కు పట్టణ మహేష్ ప్రాన్సు ఘనం గా సన్మానం చేసింది .

5, అక్టోబర్ 2011, బుధవారం

రాజమండ్రి రెడ్ ఎఫ్ ఏం దసరా సంబరాలు ఇలా జరిగాయి rjy 93.5 red fm dasara sambaraalu





రాజమండ్రి రెడ్ ఎఫ్ ఏం దసరా సంబరాలు హోటల్ షెల్టన్ లో జరిగాయి .ఉభయ గోదావరి జిల్లాకు చెందినా రెడ్ అభిమానులతో ఉల్లాసం గా ఉత్సవం గా సంబరాలు చేసారు .ఎప్పుడు కనపడ కుండ కనిపించే రేడీయో జాకీలు స్వయంగా కనిపించి ఆనదింప చేసారు .ఎఫ్ ఏం లో గురువు గా కనిపించే మురళి కార్యక్రమాన్ని నడిపించారు .వచ్చిన వారినందరిని ప్రతి నిమిషం శ్రీను మామ నవ్వించి కవ్వించాడు .డాన్సు తో అదరగొట్టాడు .మురళి -శ్రీను కడుపుబ్బా తమ మాటలతో కడుపుబ్బా నవ్వించారు .లేడీ జాకీలు సంధ్య .మహా ,హానీ తమవంతు పాత్ర పోషించారు .సాహితీ మాత్రం అలా కనిపించి ఇలా వెళ్లి పోయింది .కుర్ర ఆకాష్ టోపీ పెట్టుకుని సందడి చేసాడు .
వచ్చిన వారిలో అయిదుగురు జంటలతో ఒకికొకరు అంటూ మూడు రౌండ్ లు ఆటలాదించారు .వీటిలో డాన్సు భావుంది .రావులపాలెం జంట ఉర్రుతలూగించింది .తర్వాత ఎంపికైన ముప్పయి మంది తో రకరకల ఆటలు ఆడించారు .విజేతలకు బహుమతులు ఆడించారు .మొత్తం ఏడు గంటల పాటు ఇది జరిగింది .

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

క్లైమాక్ష్ తీయడం లో మన దర్షకు లు చేతులు ఎస్తేస్తున్నారు ????????

మధ్య ఎక్కువ సినిమాల్లో ప్రధమార్ద్తం బాగానే ఉంటున్న ద్వితీయార్ధం మాత్రం బావుండడం లేదు ..ముఖ్యం గా క్లైమాక్ష్ చప్పగా ఉంటోంది .....మొదటి భాగం లో హీరో నవ్విస్తూ హీరొయిన్ ను ఏడిపిస్తూ ..కమిడియన్స్ ను ఆట పట్టిస్తూ సరదాగా సాగి పోతూనే ...ఇంటర్వల్ సమయానికి తన విశ్వరూపంతో .....విలన్కు చమటలు పటిస్తాడు...ఇక అంతే .ప్రేక్షకుడు ...ఇంకా ఏదో ఉంది ..ఆత్రుత పడుతున్న ...సినిమా చప్పగా ..సాగదీత మొదలై చివరికి ....మొదటి భాగంలో ఉన్న ఆనందం కూడా ఆవిరి అవుతోంది .....
... సినిమా చూసిన ఇదే కనిపిస్తోంది ...విశ్రాంతి సమయానికే .....అసలు కథ అయిపోతే ..ఇక ఏముంటుంది ? క్లైమాక్ష్ అయితే మహా బోర్ గా ఉంటోంది ...ఎందుకో చాలామంది అగ్ర దర్శకులు సైతం క్లైమాక్ష్ బాగే తీయలేక పోతున్నారు ...స్క్రిప్ట్ కేవలం విశ్రాంతి వరకు రాసుకుని వదిలేసి ..తర్వాత ఏదో క్లైమాక్ష్ సీన్ అల్లుతున్నారా అన్న అనుమానం కల్గకమానడం లేదు .ఇది ప్లాప్ అయిన సినిమాలకే కాదు ..హిట్ అయిన వాటిలోన్ను అంతే ..తాజాగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న "దూకుడు " లోను ద్వితీయార్ధం చప్పాగా సాగింది .విలన్లను చంపడానికే ..సినిమా సాగదీసి నట్టు సామాన్య ప్రేక్షకుడి కైనా తెల్సిపోతుంది ....దర్శకులు కాస్త క్లైమాక్ష్ పై ద్రుష్టి పెడితే మరిన్ని సినిమాలు హిట్ అవుతాయి .

దూకుడు లో డైలాగ్స్ కొన్ని


శ్రీను వైట్ల దర్శకత్వానికి కోన వెంకట్ మాటలు ..మహేష్ బాబు డైలాగ్ డెలివరీ తోడై ప్రిన్సు పిక్షర్ దూకుడు కు ప్లస్ పాయింట్ .
దూకుడు లో డైలాగ్స్

""""మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవటమే.."""""


"""దూకుడు లేకపోతే పోలీస్ మాన్ కీ పోస్ట్ మ్యాన్ కీ తేడా ఏం ఉంటదీ?"""

""మా నాన్న ఒకటి చెప్తూ ఉండేవాడు ధైర్యంగా ముందుకెళ్ళి పోతే దారి తెలియక్కర్లేదు. డైరెక్ట్ అయిపోవటమే.""

"""నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా...!


""""చూశావా? పంచ్ పడేసరికి ప్రొఫెషన్ చెప్పేశావ్.? "


"



"నేను నరకటం మొదలెడితే నరకం లో హౌస్ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి "

"""'కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు"".


""""భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా ..... నాదీ..!""

"""కలర్ ఏంటీ నీ కలర్ ఏంటీ?
ఎదవ పిట్ట మొహమేసుకొని."".

చూస్తావ్ గా.. పర్మిషన్ ఇస్తే పేకాడేస్తాను.



"నీ లైఫ్ లో నువ్వు చాలా మంది తో పెట్టుకొని ఉంటావ్. కానీ ఒక్కడి తో మాత్రం పెట్టుకోకు. అమ్మ కడుపులోంచి ఎందుకు బయటకొచ్చానా? అని ఫీలవుతావ్. ....ఆ ఒక్కడినీ నేనే "

"పడుకున్న పులినీ, పని చేసుకునే పోలీసునీ కెలికితే... వేటే"