9, అక్టోబర్ 2011, ఆదివారం

"దూకుడు " వంద రోజుల వేడుక కాకినాడలో


మహేష్ బాబు లేటెస్ట్ హిట్ మూవీ "దూకుడు " వంద రోజుల వేడుక కాకినాడలో జరగనుంది ..దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా విషయం వెల్లడించారు .దూకుడు విజయ యాత్రలో భాగం గా చిత్ర బృందం కాకినాడ వచ్చారు .ఇక్కడే పుట్టి పెరిగిన శ్రీను కు పట్టణ మహేష్ ప్రాన్సు ఘనం గా సన్మానం చేసింది .

5, అక్టోబర్ 2011, బుధవారం

రాజమండ్రి రెడ్ ఎఫ్ ఏం దసరా సంబరాలు ఇలా జరిగాయి rjy 93.5 red fm dasara sambaraalu





రాజమండ్రి రెడ్ ఎఫ్ ఏం దసరా సంబరాలు హోటల్ షెల్టన్ లో జరిగాయి .ఉభయ గోదావరి జిల్లాకు చెందినా రెడ్ అభిమానులతో ఉల్లాసం గా ఉత్సవం గా సంబరాలు చేసారు .ఎప్పుడు కనపడ కుండ కనిపించే రేడీయో జాకీలు స్వయంగా కనిపించి ఆనదింప చేసారు .ఎఫ్ ఏం లో గురువు గా కనిపించే మురళి కార్యక్రమాన్ని నడిపించారు .వచ్చిన వారినందరిని ప్రతి నిమిషం శ్రీను మామ నవ్వించి కవ్వించాడు .డాన్సు తో అదరగొట్టాడు .మురళి -శ్రీను కడుపుబ్బా తమ మాటలతో కడుపుబ్బా నవ్వించారు .లేడీ జాకీలు సంధ్య .మహా ,హానీ తమవంతు పాత్ర పోషించారు .సాహితీ మాత్రం అలా కనిపించి ఇలా వెళ్లి పోయింది .కుర్ర ఆకాష్ టోపీ పెట్టుకుని సందడి చేసాడు .
వచ్చిన వారిలో అయిదుగురు జంటలతో ఒకికొకరు అంటూ మూడు రౌండ్ లు ఆటలాదించారు .వీటిలో డాన్సు భావుంది .రావులపాలెం జంట ఉర్రుతలూగించింది .తర్వాత ఎంపికైన ముప్పయి మంది తో రకరకల ఆటలు ఆడించారు .విజేతలకు బహుమతులు ఆడించారు .మొత్తం ఏడు గంటల పాటు ఇది జరిగింది .