26, జులై 2011, మంగళవారం
కత్రిన కైఫ్ కోసం కమలనాధులు పరుగులు
కాంగ్రెస్స్ నేత రాహుల్ గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన నటి కత్రిన కైఫ్ కోసం కమల నాధులు తెగ వెంట పడుతున్నారట .చాల డేరింగ్ గా మాట్లాడిన ఆ సుందరిని పట్టుకుని ప్రసారం చేసుకుంటే తిరుగు లేదు అనుకున్తునారట .ఇప్పటికే ఆ పార్టిలో తారలు శత్రుఘ్న సిన్హా ,వినోద్ ఖన్నా ,స్మృతి ఇరానీ ,హేమమాలిని ఉన్నారు .ఇక కత్రిన వస్తే కాంగ్రెస్స్ పై కత్తేనట
25, జులై 2011, సోమవారం
ప్రసారాలు చేసేసుకుంటే పోలే !!
తెలంగాణ సమస్య తేలక పోయిన ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు .అందుకు అందరు సిద్దమే .చంద్ర బాబు తొందర పడుతున్న్నాడు. జగన్ అభ్యర్దులను ప్రకటిస్తునాడు .సి ఏం గారు వరాలు కురిపిస్తున్నారు .ఇక యెంత పుచ్చు కోవాలో ? ఆ ..ఓటర్లు తెల్సు కోవాలి ...యెంత ఇచ్చు కోవాలో వీళ్ళు తెల్సు కోవాలి .......ఎన్నికలు కూడా ఓ ఆట క్రింద కదా లెక్క ?
23, జులై 2011, శనివారం
సీరియల్స్ లో బాలికలే విలన్లు !!!?
ఇప్పటికే టి వి సీరియల్ లో లేడీ విలనిజం పెరిగి పోయింది .ఆడవాళ్ళను చాల ఘోరంగా చూపుతూ టి వి చూసే జనం పై ప్రభావం చూపుతున్నారు .తాజాగా బాలికలను కూడా చెడ్డ వారిగా చూపిస్తున్నారు .జీ టి లో ప్రసారం అవుతున్న ఓ సీరియల్ నందు ఓ బాలికను ఏకంగా విలన్ చేసి చెడ్డ పనులు చేసే అమ్మాయిగా చిత్రీకరించారు .రాత్రి సమయంలో ప్రసారం అయ్యే ఇలాంటి వాటిని పొరపాటున పిల్లలు చూస్తె దాని ప్రభావం వారిపై ఉంటుంది .ఇలాంటివి లేకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉంది .
6, జులై 2011, బుధవారం
."ఆషాడం లో అల్లుడు గారు అత్త ఇల్లు గడప చేరితే ....ఏమవుతుంది అంటే
ఆషాడం లో అల్లుడు అత్తవారి ఇంటికి రా కూడదు అనే ఆచారం ఉంది ."ఆషాడం లో అల్లుడి అత్తవారి ఇల్లు గడప దాటితే ..మామ లేదా అత్తా కు గండం '' అంటూ ఉంటారు ...అయితే ఈ ఆచారం పెట్టడం వెనుక పెద్దల లాజిక్ ఉంది .ఆషాడ సమయంలో వర్షాలు కురుస్తాయి .ఈ సమయంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయి .ఇటువంటి సమయంలో పెళ్లి కొడుకు అత్తవారి ఇంటనే ఉంటే ...పనులు ఆగి పోతే ..చాల ఇబ్బంది .మాములుగా రమ్మంటే కొత్త పెళ్లి కొడుకు పెళ్ళాన్ని విడిచి వస్తాడా ? రాదు అందుకే పెద్దలు బెదిరింపు ..సెంటిమెంట్ తో టచ్ చేసారు .
ఈ ఆషాడం సాంప్రదాయకం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది .ఆషాడం అంటే ఇంచుమించు జూలై నెలలో అమ్మాయి గర్బం దాలిస్తే ...ఆమెకు పురుడు మండే ఎందాల్లో వచ్చి ఇబ్బంది పడుతుంది .........ఏది ఎమైనా " పెద్దల మాట చద్ది మూటే"
ఈ ఆషాడం సాంప్రదాయకం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది .ఆషాడం అంటే ఇంచుమించు జూలై నెలలో అమ్మాయి గర్బం దాలిస్తే ...ఆమెకు పురుడు మండే ఎందాల్లో వచ్చి ఇబ్బంది పడుతుంది .........ఏది ఎమైనా " పెద్దల మాట చద్ది మూటే"
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)